అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం ధరలు Gold Prices ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి.
రెండు, మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ ధరలు స్థిరంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం తులం బంగారం ధర రూ.1.33 లక్షల వరకు ఎగబాకగా, ప్రస్తుతం రూ.1.25 లక్షల పరిధిలో ఉంది.
మన దేశ సంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. నిన్న తులం బంగారం ధర పది రూపాయల మేరకు తగ్గగా, ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది.
అక్టోబర్ 27న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి.
Today Gold Prices | మార్పులు లేవు
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,760, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,290 గా ఉంది.
- ముంబయి, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,140గా నమోదైంది.
- చెన్నైలో మాత్రం కొద్దిగా తక్కువగా ధరలు ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,25,440 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,14,990గా ఉంది.
బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేవలం రూ.100 మేర తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర Silver Prices రూ.1,54,900 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో మార్పులు ఎందుకు వస్తాయనే దానిపై మార్కెట్ విశ్లేషకులు వివరణ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ విలువైన లోహాలపై డిమాండ్ పెరగడం లేదా తగ్గడం, డాలర్ Dollar బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని వారు తెలిపారు.
పెట్టుబడిదారులు investers అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో తమ సంపదను కాపాడుకునే ప్రయత్నంలో బంగారం, వెండి Silver వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
ప్రస్తుతం స్వల్పంగా తగ్గినా, రాబోయే రోజుల్లో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

