అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దీపావళి ముందురోజు అయిన దంతేరస్ సందర్భంగా బంగారం Gold, వెండి Silver ధరల పెరుగుదలకి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. సాధారణంగా ఐదు రోజుల పాటు జరిగే ఈ దీపావళి Diwali వేడుకల్లో ధన్‌తేరాస్ ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది.
దీపావళి Diwali ముందు దంతేరస్ రోజున బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకల్లో ధన్‌తేరాస్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
ఈ రోజు బంగారం, వెండి వంటి లోహాలను కొనుగోలు చేయడం శుభప్రదమని అందరు నమ్ముతుంటారు. ఈ సందర్భంలోనే ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చాయి.
శనివారం బంగారంపై దాదాపు రూ.3 వేల వరకు, వెండిపై రూ.13 వేల వరకు ధర తగ్గడం నమోదైంది. ఇదే ధోరణి సాయంత్రం వరకు కొనసాగగా, ఆదివారం ఉదయం (అక్టోబర్ 19) ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Today Gold Prices | కాస్త ఉపశమనం..
పలు వెబ్‌సైట్ల ఆధారంగా దేశీయంగా 24 క్యారెట్ల బంగారం (24 carat gold) 10 గ్రాములు రూ.1,30,860, 22 క్యారెట్ల గోల్డ్ (22 carat gold) 10 గ్రాములు రూ.1,19,950 , వెండి కిలో రూ.1,72,000 గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,30,860 , 22 క్యారెట్ల బంగారం రూ.1,19,950గా ఉండగా, వెండి కిలో రూ.1,90,000కు విక్రయించబడుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,31,010 , 22 క్యారెట్లు రూ.1,20,100గా ఉండగా, వెండి కిలో ధర రూ.1,72,000గా ఉంది.
ముంబయిలో Mumbai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,860 , 22 క్యారెట్ల బంగారం రూ.1,19,950గా ఉండగా, వెండి కిలో ధర రూ.1,72,000గా ఉంది.
చెన్నై Chennai లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,370 , 22 క్యారెట్ల బంగారం రూ.1,19,950గా ఉండగా, వెండి కిలో రూ.1,90,000 గా ఉంది.
బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ప్రభావంతో ప్రతి నగరంలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి.