అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | మార్కెట్ పరిస్థితులు, డాలర్ dollar బలహీనత, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు ధోరణిని బట్టి, వచ్చే వారాల్లో బంగారం gold ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి మార్కెట్ (అక్టోబరు 18వ తేదీ) శనివారం మరోసారి సంచలనం సృష్టించింది. నేటి బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనించాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల (24 carat Gold) బంగారం ధర రూ.1,32,780గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (22 carat Gold) ధర రూ.1,21,710గా ట్రేడ్ అయింది.
వెండి (silver) ధర గ్రాము రూ.202.90 గా ఉంది. అదే కిలో వెండి ధర పరిశీలిస్తే.. కిలో రూ. 2,02,900 వద్ద కొనసాగుతోంది.. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
అయితే, మార్కెట్ విశ్లేషకులు త్వరలో బంగారం Gold ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరల్లో మార్పుకు ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి, డాలర్ బలహీనపడితే పెరుగుతాయి.
Today Gold Prices | రానున్న రోజులలో తగ్గుదల..
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం డాలర్ విలువను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.
వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే డాలర్ విలువ పెరిగే అవకాశం ఉంది. తద్వారా బంగారం ధర తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా World పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గిస్తున్నాయి. బంగారం ధరలు భవిష్యత్తులో కరెక్షన్ దిశగా వెళ్లవచ్చని అంచనా వేసి, నిల్వలను పరిమితం చేయడం ప్రారంభించాయి.
బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, బంగారం ఓవర్‌బాట్ పొజిషన్ చేరుకున్నందున, త్వరలో ధరల్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికీ బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి సమీపంలోనే ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పసిడి ధరలు పెరుగుతుండటంతో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది భారంగా మారింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు శనివారం స్వల్ప మార్పులతో కొనసాగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,930 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,21,860, 18 క్యారెట్ల ధర రూ.97,210 గా నమోదైంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 , 22 క్యారెట్ల ధర రూ.1,21,710 , 18 క్యారెట్ల ధర రూ.99,590గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే రేంజ్‌లో ధరలు నమోదయ్యాయి. ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,780 , 22 క్యారెట్ల ధర రూ.1,21,710 , 18 క్యారెట్ల ధర రూ.99,590గా ఉంది.
పుణె, కోల్‌కతా నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం స్వల్పంగా పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,100 , 22 క్యారెట్ల ధర రూ.1,22,010 , 18 క్యారెట్ల ధర రూ.1,01,010గా ఉంది.
బెంగళూరు, కేరళల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,780 , 22 క్యారెట్ల ధర రూ.1,21,710 , 18 క్యారెట్ల ధర రూ.99,590 గా ఉంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి సమీపంలో కొనసాగుతున్నాయి.