అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లిస్తున్నాయి.
డాలరు విలువ తగ్గడం కూడా బంగారం ధరల పెరుగుదలపై కీలక ప్రభావం చూపుతోంది. డాలరు బలహీనత కారణంగా ప్రస్తుతం బంగారం అత్యంత సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్ల దృష్టిలో నిలుస్తోంది.
దేశంలో బంగారం, వెండి ధరలు Silver Prices రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండుగ సీజన్ కొనసాగుతుండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి పెరగడం వల్ల విలువైన లోహాల ధరలు భగ్గుమంటున్నాయి.
నిన్న బంగారం తులం ధర రూ.1.30 లక్షలకు చేరుకోవడం సంచలనంగా మారింది. సాధారణ వినియోగదారులు ఇప్పుడు బంగారం కొనడం దాదాపు అసాధ్యంగా మారింది.
తాజా ధరల ప్రకారం, అక్టోబరు 15న దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల (24 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,360 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,660గా నమోదైంది.
Today Gold Prices | టెన్షన్ పెడుతున్న బంగారం..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,28,510, 22 క్యారెట్ల బంగారం (22 carat gold) రూ.1,17,810గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, ముంబయి, బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ల బంగారం రూ.1,28,360, 22 క్యారెట్ల బంగారం రూ.1,17,660గా కొనసాగుతోంది.
చెన్నైలో మాత్రం బంగారం ధర మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,29,901, 22 క్యారెట్ల బంగారం రూ.1,18,260గా ఉంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా బంగారం బాటలోనే ఎగబాకుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కిలో వెండి ధర Silver Price రూ.1,89,100గా ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,06,100 దాటింది. వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో వెండి వినియోగం భారీగా పెరగడం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత 10 రోజుల్లో కిలో వెండి ధర దాదాపు రూ.35,000 పెరగడం రికార్డు స్థాయిలో ఉంది. సోమవారం ఒక్క రోజే రూ.5,000, మంగళవారం రూ.4,000 పెరగడం గమనార్హం.
రాబోయే రోజుల్లోనూ వెండి ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ అంచనా. బంగారం ధరల పెరుగుదలకు గల కారణాల్లో అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ భయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, డాలరు విలువ పడిపోవడం ముఖ్యమైనవి.
ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లడంతో ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ట్రెజరీ బాండ్ల లాభాలు తగ్గడం కూడా బంగారం Gold డిమాండ్‌ను పెంచింది.
మొత్తానికి, పండుగల సీజన్‌లో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.