అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ప్రస్తుతం బంగారం, వెండి ధరలు Silver Prices తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన విలువైన లోహాల ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం, పెట్టుబడిదారుల దృష్టి స్టాక్ మార్కెట్, ట్రెజరీ బాండ్ల వైపు మళ్లడంతో బంగారం ధరల్లో ఈ తగ్గుదల కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితమే తులం బంగారం ధర లక్షా 30 వేల రూపాయల దాకా వెళ్లింది. అయితే, ప్రస్తుతం అది సుమారు లక్షా 20 వేల వరకు తగ్గింది. వెండి కూడా ఇదే బాటలో నడుస్తోంది. గతంలో కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరువలో ఉండగా.. ఇప్పుడు అది సుమారు లక్షా 55 వేల రూపాయలకు దిగి వచ్చింది.
Today Gold Prices | స్వల్ప తగ్గుదల
నవంబరు 9వ తేదీ నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల (22 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,170గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,000గా నమోదైంది.
హైదరాబాద్, ముంబయి, విజయవాడ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,020గా ఉండగా, 22 క్యారెట్ల (22 carat gold) ధర రూ.1,11,850గా ఉంది.
చెన్నైలో మాత్రం బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,280గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,13,000గా ఉంది. ఇక వెండి ధర ప్రస్తుతం కిలోకు రూ.1,52,500 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధర Gold Price తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ dollar విలువ పెరగడమే. డాలర్ బలపడినప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లపై పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఈ బాండ్లు రాబడి ఇస్తాయి కాబట్టి, సురక్షితమైన పెట్టుబడిగా మాత్రమే ఉన్న బంగారం కంటే వాటిలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమని భావిస్తారు. దాంతో బంగారం డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయి.
మరొక కారణం అమెరికా america స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదవడం. మార్కెట్ లాభాల్లో ఉంటే పెట్టుబడిదారులు బంగారం నుంచి నిధులను ఉపసంహరించి స్టాక్‌ల వైపు మళ్లిస్తారు. దీంతో బంగారం మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు మరింత తగ్గుతాయి.
