అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | పసిడి మార్కెట్ (gold market) ఈ వారం కొనుగోలుదారులకు శుభవార్త అందించింది. వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు Silver Prices భారీగా తగ్గి వినియోగదారులకు ఊరట కలిగించాయి.
దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు 60 డాలర్లకు పైగా పడిపోగా.. తర్వాత ఇవాళ మళ్లీ స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 23 డాలర్ల dollar మేర పెరిగి 3974 డాలర్ల స్థాయికి చేరుకుంది. వెండి కూడా 1.18% మేర పెరిగి ఔన్సుకు 48.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Today Gold Prices | శాంతించిన బంగారం..
హైదరాబాద్ Hyderabad బులియన్ (bullion) మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ (24 carat pure gold) (10 గ్రా.) – రూ. 1,21,480 (మునుపటి రోజు కంటే రూ.980 తగ్గింది). 22 క్యారెట్ల (22 carat) గోల్డ్ (10 గ్రా.) – రూ. 1,11,350 (నిన్నటి కంటే రూ.900 తగ్గింది).
తులం బంగారం ధర గణనీయంగా తగ్గిపోవడంతో.. కొనుగోలుదారులు మార్కెట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.
క్రితం రోజు కిలో వెండి ధర రూ.3,000 మేర పడిపోయింది. ఇవాళ మరో రూ.500 తగ్గి రూ.1,63,000 వద్దకు దిగివచ్చింది. ఇతర ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీలో.. కిలో వెండి ధర సగటుగా రూ. 1,50,500కి లభిస్తోంది.
నవంబరు 6వ తేదీ ఉదయం 7 గంటలకు ఈ ధరలు నమోదు కాగా.. మధ్యాహ్నం తరువాత మార్కెట్ Market పరిణామాలపై ఆధారపడి ధరలు మారవచ్చు. అలాగే పన్నులు, తయారీ ఛార్జీలు కలిపితే తుది ధరలు వేరు వేరుగా ఉండవచ్చు.
అందుకని, బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో ధరలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద, వరుస తగ్గుదలతో పసిడి మార్కెట్ కొనుగోలుదారులకు ఈ వారం లాభదాయకంగా మారింది.
