అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశంలో బంగారం ధరలు Gold Prices ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయానికి దేశవ్యాప్తంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,990గా నమోదైంది.
అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,740గా ఉండగా, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.92,240 వద్ద నిలిచింది.
హైదరాబాద్, విజయవాడలతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు దేశంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,51,900గా ఉంది. అయితే హైదరాబాద్, విజయవాడ, కేరళ వంటి నగరాల్లో మాత్రం వెండి ధర కిలోకు రూ.1,65,900 వద్ద తచ్చాడుతోంది.
Today Gold Prices | స్థిరంగా ధరలు..
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, గత వారం 24 క్యారెట్ ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,002 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగింది. కానీ విశ్లేషకుల అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో ఈ ధర 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
సాంకేతిక కారణాలను మినహాయిస్తే, బంగారం ధరలు తగ్గడానికి ప్రత్యేక కారణాలు లేవని వారు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న మౌలిక డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నాయి.
దీంతో పాటు, సెంట్రల్ బ్యాంకులు Central Banks, మదుపర్లు బంగారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందున ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు చూస్తే చెన్నైలో 24 క్యారెట్ (24 carat gold) రూ.1,23,370 , 22 క్యారెట్ రూ.1,13,090, 18 క్యారెట్ రూ.94,340గా ఉన్నాయి.
- ముంబై, కోల్‌కతా, బెంగళూరు Bangalore, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలలో 24 క్యారెట్ రూ.1,22,990 , 22 క్యారెట్ రూ.1,12,740, 18 క్యారెట్ రూ.92,240గా కొనసాగుతున్నాయి.
- ఢిల్లీలో 24 క్యారెట్ రూ.1,23,140 , 22 క్యారెట్ రూ.1,12,890 , 18 క్యారెట్ రూ.92,390గా ఉంది.
- వడోదరా, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ రూ.1,23,040 , 22 క్యారెట్ (22 carat gold) రూ.1,12,790 , 18 క్యారెట్ రూ.92,290గా ఉంది.
