అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గత నాలుగు–ఐదు రోజులుగా రెకార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు Gold Prices ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్లు కొనుగోళ్లను నిలిపివేయడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త వెనక్కి తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు. నవంబర్ 28న తులం బంగారం ధర రూ.1,27,740 వద్ద కొనసాగుతుండగా, నిన్నటితో పోలిస్తే తులం ధరలో రూ.170 తగ్గుదల నమోదైంది.
బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్న సమయంలో వెండి మాత్రం తీవ్రమైన ర్యాలీని కొనసాగిస్తోంది. నవంబర్ 26తో పోల్చితే నవంబర్ 27న కేజీ వెండి ధర ఒక్క రోజులోనే రూ.4,000 పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,80,100కు చేరుకుంది. గ్రాము వెండి రేటు ప్రస్తుతం రూ.180 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
Today Gold Prices | తగ్గిన ధరలు..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు ఉదయం నమోదు అయిన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,740గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,17,090గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,27,890, 22 క్యారెట్ ధర రూ.1,17,240గా నమోదైంది. చెన్నైలో Chennai మాత్రం ధరలు కొంత ఎక్కువగా ఉండి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,390, 22 క్యారెట్ల ధర రూ.1,17,690గా ఉంది.
ఈ ధరలు ఉదయం నమోదైనవి మాత్రమే. రోజంతా మార్కెట్ మార్పుల ప్రకారం ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. బంగారం ధరలు హెచ్చు తగ్గులు సామాన్యులని కలవరపరుస్తున్నాయి.
పెళ్లిళ్ల సీజన్‌లో MArriage Season బంగారం కొనాలని చాలా మంది ఆసక్తి చూపుతుండగా ఈ ధరలు పెరుగుదల గుండెల్లో గుబులు రేపుతుంది. ఈ మధ్య బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పడం చాలా కష్టంగా ఉంది. తగ్గినప్పుడే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయడం మంచిది
