అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు Gold Prices భారీగా పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది.
24 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,700 మేర పెరిగి, గురువారం ఉదయం 6.30 గంటలకు రూ.1,27,920కు చేరుకుంది. 22 క్యారెట్ ఆభరణాల బంగారం కూడా రూ.1,17,920కు చేరి కొత్త రికార్డులు సృష్టించింది.
ఇదే సమయంలో వెండి కూడా మరింత చురుగ్గా పరుగెడుతోంది. కిలో వెండి ధర రెండు రోజుల్లో రూ.6,000 పెరిగి ప్రస్తుతం రూ.1,69,100 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ వంటి కొన్ని నగరాల్లో వెండి కిలో రూ.1,76,100 వద్ద నమోదైంది.
Today Gold Prices | పెరుగుతున్న ధరలు…
దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు(24కే, 22కే,18 కే) ఎలా ఉన్నాయనేది చూస్తే..
- చెన్నై: రూ. 1,28,740 – రూ. 1,18,010 – రూ. 98,460
- ముంబై Mumbai: రూ. 1,27,920 – రూ. 1,17,260 – రూ. 95,940
- న్యూఢిల్లీ: రూ. 1,28,070 – రూ. 1,17,410 – రూ. 96,090
- కోల్‌కతా: రూ. 1,27,920 – రూ. 1,17,260 – రూ. 95,940
- బెంగళూరు: రూ. 1,27,900 – రూ. 1,17,240 – రూ. 95,940
- హైదరాబాద్: రూ. 1,27,920 – రూ. 1,17,260 – రూ. 95,940
- విజయవాడ: రూ. 1,27,920 – రూ. 1,17,260 – రూ. 95,940
- కేరళ: రూ. 1,27,910 – రూ. 1,17,240 – రూ. 95,930
- పుణె: రూ. 1,27,920 – 1,17,260 – రూ. 95,940
- వడోదరా: రూ. 1,27,970 – 1,17,310 – రూ. 95,990
- అహ్మదాబాద్: రూ. 1,27,970 – రూ. 1,17,310 – రూ. 95,990గా ట్రేడ్ అయింది.
వెండి ధరలు కిలోకు చూస్తే..
- చెన్నై: రూ. 1,76,100
- ముంబై: రూ. 1,69,100
- న్యూఢిల్లీ: రూ. 1,69,100
- కోల్‌కతా: రూ. 1,69,100
- బెంగళూరు: రూ. 1,69,100
- హైదరాబాద్: రూ. 1,76,100
- విజయవాడ: రూ. 1,76,100
- కేరళ: రూ. 1,76,100
- పుణె: రూ. 1,69,100
- వడోదరా: రూ. 1,69,100
- అహ్మదాబాద్: రూ. 1,69,100గా నమోదైంది.
ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతకు దారితీసే అవకాశాలు మరింత బలపడటమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉందనే సంకేతాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి.
దీనితో పాటు డాలర్ సూచీ 100 మార్క్ కంటే దిగువకు పడిపోవడం బంగారం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో Global Market డాలర్ బలహీనపడితే సాధారణంగా బంగారంలో పెట్టుబడులు పెరిగే ధోరణి కొనసాగుతుండటంతో ఈ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, ఈ ర్యాలీ ఎక్కువకాలం నిలబడదని నిపుణుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం శాంతి దిశగా సాగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తగ్గుముఖం పట్టడం వలన సేఫ్ హెవెన్‌గా భావించే బంగారం డిమాండ్ మళ్లీ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.