అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం ధరలు Gold Prices షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ కొనుగోలుదారులను సాంత్వనపరిచిన బంగారం రేట్లు, మళ్లీ షాకిస్తున్నాయి.
కొన్ని వారాల క్రితం తులం బంగారం ధర రూ. లక్షా 20 వేల దిగువన చేరగా, ఇప్పుడు మెల్లగా పెరిగి మళ్లీ పాత రేటుకే వచ్చింది. నవంబరు 12వ తేదీ (బుధవారం) నాటికి దేశవ్యాప్తంగా తులం బంగారం ధర రూ.1,25,850 వద్ద కొనసాగుతోంది.
Today Gold Prices | మళ్లీ పెరుగుదల..
మూడు రోజుల్లోనే కనీసం రూ.2,000 పెరుగుదల నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,27,650; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,17,010
- ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,27,850; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,15,360గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీ Delhi: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,25,980; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,15,510
- హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కేరళ: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,25,850; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,15,360గా ట్రేడ్ అయింది.
బంగారం Gold తో పాటు వెండి silver కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,60,100 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళల్లో కిలో వెండి ధర రూ.1,70,100గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో కిలో వెండి ధర రూ.1,60,100గా నమోదైంది.
తాజా ధరల ప్రకారం, రాబోయే వారాల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, రూపాయి మారకం విలువ, మరియు ద్రవ్యోల్బణం ప్రభావం బంగారం ధరలపై కీలకంగా ఉండనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ Marriages season కావడంతో చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని ధరలు ఇలా పెరుగుతూ పోతుండడంతో మహిళల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సామాన్యులు అయితే అటు వైపు చూడాలన్నా కూడా జంకుతున్నారు.
