అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవలి కాలంలో బంగారం ధరలు Gold Price భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాస్త స్థిరంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు దృష్టి మళ్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బంగారం మీద డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్లో ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (నవంబరు 11న) దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,23,830గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 1,13,510కు చేరుకుంది. విజయవాడలో కూడా ఇదే రేటు కొనసాగింది.
Today Gold Prices | స్థిరంగా ధరలు..
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,980కు చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,13,660గా నమోదైంది.
- ముంబయి, చెన్నై, బెంగళూరు, కేరళ Kerala, పుణె Pune వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,830 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,13,510గా ఉంది.
- వడోదర (Vadodara) లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,880, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,560గా ఉంది.
- కోల్‌కతా (Kolkata) లో మాత్రం ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,010, 22 క్యారెట్ల ధర రూ. 1,11,840గా ఉంది.
మొత్తానికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెద్దగా మారకపోవడంతో మార్కెట్ స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
వెండి ధరల్లో Silver Prices మాత్రం స్వల్ప పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోల్చితే కిలో వెండి ధర సుమారు వంద రూపాయల మేర పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 1,69,100గా ఉండగా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, వడోదర, అహ్మదాబాద్‌లలో రూ. 1,57,100గా ఉంది.
పెట్టుబడిదారులు ప్రస్తుతం బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఉన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు కొంతమేర స్థిరంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి రేట్లు మరలా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
