Homeతాజావార్తలుToday Gold Prices | పెట్టుబడిదారులకు షాక్.. త‌గ్గుతున్న బంగారం ధ‌ర

Today Gold Prices | పెట్టుబడిదారులకు షాక్.. త‌గ్గుతున్న బంగారం ధ‌ర

Today Gold Prices | ఇటీవలి కాలంలో భారీ ఎత్తున పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. భౌగోళిక–రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నందున, బంగారంపై డిమాండ్‌ నిరంతరంగా కొనసాగుతోంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో తగ్గుదల కొనసాగుతోంది. గత వారం నుంచి పడిపోతున్న పసిడి ధర, తాజాగా కూడా అతి స్వల్పంగా తగ్గింది.

తులం ధర లక్షా 30 వేల దాటిన బంగారం gold ప్రస్తుతం భారీగా దిగివచ్చింది. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. తాజా వివరాల ప్రకారం, నవంబరు 10 (సోమ‌వారం)వ తేదీన పరిశీలిస్తే..

దేశీయ మార్కెట్లో market తులం బంగారం ధర రూ.1,22,010 కాగా, అలాగే కిలో వెండి silver ధర రూ.1,52,400 వద్ద కొనసాగుతున్నాయి. గత 14 ట్రేడింగ్‌ సెషన్లలో కొద్ది లాభాలు మినహా, రెండు విలువైన లోహాలు కూడా నిరంతరం తగ్గుముఖం పట్టాయి.

Today Gold Prices | క్ర‌మంగా త‌గ్గుద‌ల‌

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే..

  • ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,22,160 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,11,990
  • ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,22,010 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,11,840
  • హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,22,010 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,11,840
  • విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,22,010 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,11,840
  • చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,23,270 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,12,990
  • బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,22,010 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,11,840
  • కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,22,010 ; 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹ 1,11,840గా ట్రేడ్ అయింది.

దేశవ్యాప్తంగా కిలో వెండి ధర ₹1,52,400 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, కేరళ, చెన్నై వంటి నగరాల్లో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.

అక్కడ కిలో వెండి ధర రూ.1,64,900 వద్ద నమోదైంది. మొత్తం మీద, బంగారం–వెండి ధరల్లోని ఈ తగ్గుదల పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది.

గ్లోబల్ మార్కెట్లలో డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల అనిశ్చితి, అలాగే అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం కారణంగా ఈ విలువైన లోహాలపై ఒత్తిడి కొనసాగుతోంది.

Must Read
Related News