అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం బంగారం ధర రూ. లక్షా 35 వేల రూపాయలకి చేరువ కావడంతో సామాన్యుడికి ఆభరణాల కొనుగోలు భారంగా మారింది. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి Gold అత్యంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఇటీవల ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 14న దేశీయంగా తులం బంగారం ధర రూ.1,34,000 వరకు ఉండగా, గత నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే దాదాపు రూ.5,000 వరకు పెరిగింది. డిసెంబర్ 14 ఉదయం నమోదైన ధరల ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,070గా, 22 క్యారెట్ల ధర రూ.1,22,900గా ఉంది.
Today Gold Prices | పరుగో పరుగు..
ముంబయి, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కేరళల్లో Kerala 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం gold ధర రూ.1,33,910గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర రూ.1,22,750గా నమోదైంది. చెన్నై chennai లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,950గా, 22 క్యారెట్ల ధర రూ.1,23,700గా ఉంది.
Today Gold Prices | వెండి ధరలు..
ఇక వెండి ధరలు కూడా భారీగానే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,98,000 వద్ద స్థిరంగా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో బంగారం, వెండిపై పెట్టుబడులు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వడ్డీ రేట్ల తగ్గుదలతో బాండ్ దిగుబడులు తగ్గుతాయని అంచనాతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా 67 శాతం పెరగగా, అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 60 శాతం పెరిగాయని లండన్ London బులియన్ మార్కెట్ అసోసియేషన్ వెల్లడించింది.
ప్రపంచ పరిస్థితులు, రూపాయి డాలర్ మారకం విలువ ఇదే విధంగా కొనసాగినా లేదా రూపాయి మరింత బలహీనపడినా 2026లో బంగారం ధరలు మరో 5 నుంచి 16 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.