Homeబిజినెస్​Today Gold Price | భ‌గ్గుమ‌న్న బంగారం.. ఆల్‌టైమ్ గ‌రిష్టం.. ఆశ వదులుకుంటున్న సామాన్యులు!

Today Gold Price | భ‌గ్గుమ‌న్న బంగారం.. ఆల్‌టైమ్ గ‌రిష్టం.. ఆశ వదులుకుంటున్న సామాన్యులు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశీయంగా బంగారం ధరలు (Gold Price) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. సామాన్యులు అందుకోలేని స్థాయికి పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా International భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, డాలరుతో పోల్చితే రూపాయి క్షీణత వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులవైపు మొగ్గు చూపుతుండడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు ఆకాశాన్ని skyrocket తాకుతున్నాయి. ఈ రోజు (సెప్టెంబరు 6) మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 24 carat gold price రూ. 1,07,630కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 98,660గా నమోదైంది.

వెండి ధరల విషయానికొస్తే నిన్న‌టి కంటే వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వెండి ధర కిలోకు సుమారు రూ.100 తగ్గింది. ఇది కొంతవరకు వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం.

Today Gold Price : ప‌రుగులు పెడుతున్న ప‌సిడి..

ధరల పెరుగుదల వెనుక గల ప్రధాన కారణాలు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు అనే చెప్పాలి. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలలో అస్థిరత తీవ్రంగా ఉంది. అందుకే పెట్టుబడిదారులు బంగారంలాంటి సురక్షిత రంగాలవైపు దారి మళ్లుతున్నారు. డాలరుతో పోల్చితే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి అయ్యే బంగారం ఖర్చు పెరిగింది.

స్టాక్ మార్కెట్లలో (Stock Markets) మార్పులు, మందగమనం నేపథ్యంలో చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా చూసి కొనుగోలు చేస్తున్నారు. పండుగల సీజన్‌కి ముందు బంగారం ధరలు ఇలా రికార్డు స్థాయికి చేరడం వినియోగదారులకు షాక్‌ ఇచ్చినప్పటికీ, పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశంగా మారవచ్చు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నందున, బంగారం కొనుగోలుపై స్పష్టమైన ఆర్థిక వ్యూహంతో ముందుకు వెళ్లటం మేలు.

  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,780గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,810గా ట్రేడ్ అయింది.
  • ముంబయిలో (Mumbai) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660గా ట్రేడ్ అయింది.
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630కి చేరుకోగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660గా ట్రేడ్ అయింది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 గా ట్రేడ్ అయింది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660గా ట్రేడ్ అయింది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630కి చేరుకోగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660గా ట్రేడ్ అవుతుంది. ఇక వెండి ధర విషయానికొస్తే రూ.1,25,900 గా ట్రేడ్ అయింది.