Homeబిజినెస్​Today Gold Price | పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

Today Gold Price | పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలోని బంగారం (Gold) ప్రియులకు ఇది శుభవార్త. ఆగస్టు 12 ఉదయానికి బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా ఆల్‌టైమ్ హైలో ఉన్న గోల్డ్ రేట్స్ ఈరోజు కాస్త వెనుకడుగు వేశాయి.

ఢిల్లీలో రూ.760 తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌(24 carat gold price) రూ.1,02,420కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర (22 carat gold price) రూ. 93,890గా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ కిలో వెండి ధర రూ.1,16,900 గా నమోదైంది.

ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాకినా, ఈ రోజు ప‌డిపోడానికి ముఖ్యమైన కారణాలు చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడడం, పెట్టుబడిదారుల లాభాల బుకింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఊహాగానాలు.

Today Gold Price : కాస్త త‌గ్గుద‌ల‌..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి (Silver) ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,02,270గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.93,740గా ట్రేడ్ అయింది. ఇక వెండి (1 కిలో) రూ. 1,26,900గా నమోదైంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (24 carat gold price) రూ. 1,02,270 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 93,740, వెండి రూ. 1,26,900గా ట్రేడ్ అయింది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,270, 22 క్యారెట్ల బంగారం రూ. 93,740, వెండి రూ. 1,26,900గా న‌మోదైంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,270 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 93,740, వెండి రూ. 1,16,900గా ట్రేడ్ అయింది.

ఢిల్లీతో పోలిస్తే కొన్ని నగరాల్లో స్వల్ప వ్యత్యాసాలను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే వెండి ధరలు మాత్రం హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో ఢిల్లీ కంటే ఎక్కువగా ఉన్నాయి.

వెండి ధరలు స్థిరంగా ఉండ‌డానికి కార‌ణం పారిశ్రామిక వినియోగం, స్థిరమైన మార్కెట్ డిమాండ్ వల్లనే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఏడాది చివరికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, కొనుగోలు చేయాలంటే ట్రెండ్‌ను బాగా గమనించి సరైన సమయంలో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.

బంగారం ధరల తగ్గుదల తాత్కాలికమే కావచ్చు. కానీ శ్రావణమాసం, పండుగల (Festival) సీజన్ దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారులు ఇప్పుడే కొనుగోలు చేయ‌క త‌ప్ప‌దు.