Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌.. రాఖీ పండ‌గ రోజు కూడా నిరాశే..!

Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌.. రాఖీ పండ‌గ రోజు కూడా నిరాశే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం (Gold) ధ‌ర‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ప్రపంచ ఉద్రిక్తతలు పెరుగుతుండ‌డం, బంగారంపై పెట్టుబడిదారులు ఆస‌క్తి చూపించ‌డం కూడా బంగారం పెరుగుధ‌ల‌కి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు బంగారం ధరలపై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపించాయ‌ని తెలుస్తోంది.

ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆగస్టు 9వ తేదీన దేశీయంగా బంగారం ధరలు (gold rate today) పెర‌గ‌డంతో సామాన్యులు వామ్మో అంటున్నారు. నిన్నటితో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా 500 రూపాయలకు పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320గా న‌మోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 వద్ద ట్రేడ్ అయింది. వెండి విషయానికొస్తే కిలో రూ.1,16,900గా ఉంది. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల క‌నిపించింది.

Today Gold Price : బంగారం పైపైకి..

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • హైదరాబాద్‌ (Hyderabad) లో రూ.1,03,320 – రూ.94,710గా న‌మోదైంది.
  • ఇక విజయవాడలో రూ.1,03,320 – రూ.94,710 ,
  • ఢిల్లీలో రూ.1,03,470 – రూ.94,860
  • ముంబైలో రూ.1,03,320 – రూ.94,710
  • వడోదరలో రూ.1,03,370 – రూ.94,760
  • కోల్‌కతాలో రూ.1,03,320 – రూ.94,710
  • చెన్నైలో రూ.1,03,320 – రూ.94,710
  • బెంగళూరులో రూ.1,03,320 – రూ.94,710
  • కేరళలో రూ.1,03,320 – రూ.94,710
  • పుణెలో రూ.1,03,320 – రూ. 94,710గా ట్రేడ్ అయింది.

ఇక ప్రధాన నగరాల్లో వెండి (Silver rates) ధరలు (కేజీకి) చూస్తే..

  • హైదరాబాద్‌లో రూ.1,26,900
  • విజయవాడలో రూ.1,26,900
  • ఢిల్లీలో రూ.1,16,900
  • చెన్నైలో రూ.1,26,900
  • కోల్‌కతాలో రూ.1,16,900
  • కేరళలో రూ.1,26,900
  • ముంబైలో రూ.1,16,900
  • బెంగళూరులో రూ.1,16,900
  • వడోదరలో రూ.1,16,900
  • అహ్మదాబాద్‌లో రూ.1,16,900గా ట్రేడ్ అయింది.

భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతున్న క్రమంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.