అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల లక్షమార్కు దాటిన పసిడి ధర నాన్‌స్టాప్‌గా పెరుగుతూ పోతోంది. ఏకంగా లక్షా 3 వేల రూపాయల మార్క్ దాటిన.. స్వచ్ఛమైన పసిడి ధర రానున్న రోజులలో మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు వెండి Silver ధర కూడా అదే స్థాయిలో భారీగా పెరుగుతూ పోతుండటంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఆగస్టు 10 2025 ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (22 carat gold) ధర 1,03,040కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.94,450కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గిందనే చెప్పాలి.
Today Gold Price : అమ్మకాలు అంతంత మాత్రమే..
ప్రధాన నగరాలలో బంగారం (Gold) రేట్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.. (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) పరంగా..
- హైదరాబాద్ Hyderabad లో రూ. 1,03,040 – రూ. 94,450గా నమోదైంది.
- విజయవాడ Vijayawada లో రూ. 1,03,040 – రూ. 94,450
- ఢిల్లీ Delhi లో రూ. 1,03,190 – రూ. 94,600
- ముంబై Mumbai లో రూ. 1,03,040 – రూ.94,450
- వడోదర Vadodara లో రూ. 1,03,090 – రూ. 94,500
- కోల్‌కతా Kolkata లో రూ. 1,03,040 – రూ. 94,450
- చెన్నైChennai లో రూ. 1,03,040 – రూ. 94,450
- బెంగళూరు Bengaluru లో రూ. 1,03,040 – రూ. 94,450
- కేరళ Kerala లో రూ. 1,03,040 – రూ. 94,450
- పుణె Pune లో రూ. 1,03,040 – రూ. 94,450గా ట్రేడ్ అయింది.
ఇక వెండి ధరలు విషయానికి వస్తే(కేజీకి)..
- హైదరాబాద్‌లో రూ. 1,27,000
- విజయవాడలో రూ. 1,27,000
- ఢిల్లీలో రూ. 1,17,000
- చెన్నైలో Chennai రూ. 1,27,000
- కోల్‌కతాలో రూ. 1,17,000
- కేరళలో రూ. 1,27,000
- ముంబైలో రూ. 1,17, 000
- బెంగళూరులో రూ. 1,17,000
- వడోదరలో రూ. 1,17 000
- అహ్మదాబాద్‌లో రూ. 1,17,000గా నమోదైంది.
ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ సమయంలో బంగారం, వెండి ధరలు అలా పెరుగుతూ పోతుండటంతో ఏమి చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. మరోవైపు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా క్రమేపి తగ్గుతోంది.