Homeబిజినెస్​Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంతంటే..!

Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. భౌగోళిక ప‌రిస్థితుల కార‌ణంగా ఒక‌సారి బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి, మ‌రోసారి త‌గ్గుతున్నాయి. అయితే భారత మార్కెట్లో జూన్ 27న బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. గత నాలుగు రోజులుగా ధరలు పడిపోతున్న వేళ, ఈ రోజు మాత్రం ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు.

జూన్ 23 నుంచి 26 వరకు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,800 తగ్గింది. జూన్ 14న 24 క్యారట్​ల పసిడి 10 గ్రాములకు రూ.1,01,680 గరిష్ఠాన్ని తాకింది, 22 క్యారెట్ల బంగారం రూ.93,200 స్థాయిలో ట్రేడయ్యింది. అయితే 15 నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వ‌చ్చాయి.

Today Gold Price : స్థిరంగానే ధ‌ర‌లు..

ఇక ఈరోజు బంగారం ధరలు (జూన్ 27) చూస్తే.. హైదరాబాద్/విజయవాడలో 24 క్యారెట్ లు (10 గ్రాములు): ₹ 98,940, 22 క్యారెట్​లు (10 గ్రాములు): ₹ 90,690 గా ఉన్నాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్​లు (10 గ్రాములు): ₹ 99,090 కాగా, 22 క్యారెట్​లు (10 గ్రాములు): ₹ 90,840గా ఉంది. మిగ‌తా ప్రాంతాల‌లో కూడా దాదాపు అదే ప‌రిస్థితి ఉంది.

ఇక ఈరోజు వెండి ధరలు (జూన్ 27) చూస్తే ఢిల్లీలో కిలో వెండి ధర ₹1,07,900గా ఉంది. హైదరాబాద్/విజయవాడలో కిలో వెండి Silver ధర ₹ 1,17,900గా ట్రేడ్ అయింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు బలమైన స్థాయిలో కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, జియోపొలిటికల్ పరిణామాలు, ఫెడ్ రేట్లపై ఊహాగానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

కొంతమంది నిపుణులు త్వరలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని చెబుతుంటే, మరికొంత మంది మాత్రం ద్రవ్యోల్బణం, డాలర్ Dollar బలంతో ధరలు మరింత పడిపోతాయ‌ని అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులకు ఇది ఓ ‘వెయిట్ అండ్ వాచ్’ దశగా భావిస్తున్నారు. ఏది ఏమైనా సామాన్యుల‌కి మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాయి.

Must Read
Related News