Homeబిజినెస్​Today Gold Price | ల‌క్ష మార్క్​ను దాటేసిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు రేటు...

Today Gold Price | ల‌క్ష మార్క్​ను దాటేసిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు రేటు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ఊహించిన‌ట్టే బంగారం ధ‌ర‌ (Gold rates) ల‌క్ష మార్క్ దాటేసింది. కొన్ని రోజులుగా ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ ఆల్‌టైమ్ హైకి చేరాయి. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినట్టు త‌గ్గి, మళ్లీ పసిడి ధరలు (Gold price) లక్ష మార్క్‌ను దాటి వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. జులై 20, 2025 నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,00,040 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.91,700. వెండి(కిలో) రూ.1,16,000గా న‌మోదైంది. అయితే నగల తయారీ వ్యయాలు, నగరాల వారీ భౌగోళిక పరిస్థితుల మేరకు బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.

Today Gold Price | ల‌క్ష దాటేసిందిగా..

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్​లో (Hyderabad) 24 క్యారెట్ల గోల్డ్: రూ.1,00,040 కాగా, 22 క్యారెట్ల గోల్డ్: రూ.91,700గా న‌మోదైంది. వెండి (కిలో): రూ.1,26,000గా ట్రేడ్ అయింది. విజయవాడ / విశాఖపట్నంల‌లో 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.1,00,040 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.91,700, వెండి: రూ.1,26,000గా ఉంది. ఢిల్లీలో (Delhi) 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.1,00,190 కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.91,850, వెండి: రూ.1,16,000గా ఉన్నాయి. ఇక ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.1,00,040గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.91,850, వెండి: రూ.1,16,000గా ట్రేడ్ అయింది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.1,00,040 కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌: రూ.91,700, వెండి: రూ.1,26,000 పలుకుతున్నాయి.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.1,00,040 కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.91,170, వెండి: రూ.1,16,000గా ట్రేడ్ అయింది. బంగారం ధరలు లక్ష రూపాయల మార్క్‌ను దాటి కొనసాగుతుండడం, అలాగే వెండి ధర (Silver price) కూడా రూ.1.25 లక్షలకు చేరువ కావడంతో మధ్య తరగతి ప్రజలకు భారం అవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కాస్త అసౌకర్యంగా మారింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు నిత్యం ధరలను ఫాలో అవుతూ, తక్కువ సమయంలో కొనుగోలు చేయడం మంచిది.

Must Read
Related News