ePaper
More
    Homeబిజినెస్​Today gold price | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

    Today gold price | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | అంతర్జాతీయ మార్కెట్లలో (Global markets) ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణులు దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులు ఊరటనిచ్చిన ధరలు మళ్లీ పెరుగుతుండటం పసిడి ప్రియులకు షాక్‌ ఇచ్చినట్లైంది. కాగా, జులై 6, 2025 ఆదివారం నమోదైన ధరల ప్రకారం బంగారం (Gold price), వెండి ధరలు (Sliver price) ఎలా ఉన్నాయంటే.. దేశవ్యాప్తంగా బంగారం ధరల ప‌రిస్థితి చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,830 (పది గ్రాములు), 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,600 (పది గ్రాములు)గా ఉంది. ఇక వెండి ధరలు చూస్తే వెండి ధర (కిలో) రూ.1,10,000 – రూ.1,20,000 మధ్య ఉంది.

    Today gold price | ఏ నగరంలో ధరలు ఎలా ఉన్నాయంటే..

    ఇక ప్రముఖ నగరాల్లో ధరలపై ఓ లుక్కేద్దాం. హైదరాబాద్‌లో 24 క్యారెట్లు ₹98,830గా ఉండ‌గా, 22 క్యారెట్లు- ₹90,600, వెండి కిలో ₹1,20,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంల‌లో బంగారం ధరలు హైదరాబాద్ ధ‌ర‌ల‌తో సమానంగా ఉన్నాయి. ఇక వెండి ₹1,20,000లు పలుకుతోంది. ఢిల్లీలో చూస్తే.. 24 క్యారెట్లు ₹98,980గా, 22 క్యారెట్లు –₹90,750గా, వెండి ₹1,10,000గా న‌మోదైంది. ముంబైలో (Mumbai) 24 కారెట్ల బంగారం ₹98,830 కాగా, 22 కారెట్ల ధర ₹90,600గా, వెండి ₹1,10,000గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం 24 కారెట్ల ధర ₹98,830గా, 22 కారెట్ల ధర ₹90,600గా, వెండి ₹1,20,000గా ఉన్నాయి. బెంగళూరులో బంగారం 24 కారెట్ల ధర ₹98,830గా, 22 కారెట్ల ధర ₹90,600, వెండి ₹1,10,000గా పలుకుతున్నాయి.

    బంగారం ధరలు ఇటీవల ఆల్‌టైమ్ హైని తాకిన తర్వాత కొంత తగ్గినా, మళ్లీ పెరుగుతున్న ధోరణి కనబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో గందరగోళం, స్టాక్ మార్కెట్లలో ఏర్ప‌డిన అల‌జ‌డి, డాలర్ (Dollar) బలహీనత వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో మరింత పెరుగుదల ఆశించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు ప్రాంతీయ వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకుని, మార్కెట్‌ను గమనించాలంటున్నారు నిపుణులు.

    More like this

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...

    Nizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు....