అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రేమ్ కుమార్ (Additional Collector Prem Kumar) సూచించారు.
మాస్టర్ ట్రైనర్లుగా (Master Trainers) శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు ఆపదమిత్ర (Apadamitra) వలంటీర్లు బుధవారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో 300మంది ఆపదమిత్ర వలంటీర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకోగా.. ఐదుగురిని మాస్టర్ ట్రెయినింగ్ కోసం ఎంపిక చేసి బెంగళూరులోని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీలో 21 రోజులు మెరుగైన శిక్షణ అందించారు.
జిల్లా నుంచి శిక్షణ పొందిన సురేఖ, జమున, రాజు, వెంకటేష్, సునీల్‌లను అదనపు కలెక్టర్ అభినందించారు. ట్రెయినింగ్ పూర్తి చేసుకున్న వలంటీర్లు మిగతా వలంటీర్లకు విపత్తు సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నివారించాలనే అంశాలపై మెళకువలు తెలపాలని సూచించారు.