అక్షరటుడే, వెబ్డెస్క్ : Pawan Kalyan | ప్రస్తుత రోజుల్లో ఎన్నికల్లో గెలవడానికి చాలా మంది అనేక హామీలు ఇస్తుంటారు. అయితే గెలిచాక వాటిని మర్చిపోతారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇచ్చిన మాట కోసం వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లి మండలం ఇప్పటంలో బుధవారం పర్యటించారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చేశారు. జనసేన (Janasena) ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారని ఇళ్లు కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ అప్పట్లో గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఆ సమయంలో ఎన్నికల్లో గెలిచాక మళ్లీ తమ గ్రామానికి రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరింది. ఆయన సరే అని మాట ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంటికి చేరుకున్నారు.
Pawan Kalyan | పాదాభివందనం చేసిన పవన్
నాగేశ్వరమ్మ ఇంటికి చేరిన పవన్ ఆమెకు పాదాభివందనం చేశారు. డిప్యూటీ సీఎం (Deputy CM)కు ఆమె ఘన స్వాగతం పలికారు. వృద్ధురాలిని ఆలింగనం చేసుకొని పవన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాగేశ్వరమ్మకు రూ.50 వేలు, మనవడికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. పవన్ ఐదు సార్లు సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెలా తన వేతనం నుంచి రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
పవన్ కల్యాణ్ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని నాగేశ్వరమ్మ అన్నారు. ఇంటికి పెద్ద కుమారుడిలా తన యోగక్షేమాలు తెలుసుకున్నారని ఆమె పేర్కొన్నారు. తమ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు.