Digital Library | పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థానాల్లో నిలవాలి
Digital Library | పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థానాల్లో నిలవాలి

అక్షరటుడే, ఆర్మూర్​: Digital Library | యువతీయువకులు డిజిటల్​ లైబ్రరీ(Digital Library)లో సేవలను వినియోగించుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి(Anthireddy Rajireddy) అన్నారు. సోమవారం ఆర్మూర్​ కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​రెడ్డి(Incharge Vinay Reddy)తో కలిసి పట్టణంలోని గ్రంథాలయంలో డిజిటల్​ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్మూర్​ ఏఎంసీ ఛైర్మన్​ సాయిబాబా గౌడ్​, కాంగ్రెస్ నాయకులు గిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.