Homeజిల్లాలుకామారెడ్డిTNGOs Kamareddy | ఎక్సైజ్ శాఖలో టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు

TNGOs Kamareddy | ఎక్సైజ్ శాఖలో టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు

టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఎక్సైజ్ శాఖలో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: TNGOs Kamareddy | టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని (membership registration program) వేగవంతం చేస్తోంది. వివిధ శాఖల ఉద్యోగుల నుంచి సభ్యత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్ శాఖలో (Excise Department) శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. 80 ఏళ్ల చరిత్ర కలిగి.. ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీవోస్​ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, జిల్లా సహాధ్యక్షులు చక్రధర్, శివకుమార్, ఈసీ కేంద్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, పోచయ్య, రాజేశ్వర్, పబ్లిసిటీ సెక్రెటరీ రాజ్ కుమార్, కొండల్ రెడ్డి, ఎంఎస్ రావు, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News