Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | టీఎన్జీవోస్​ కార్యవర్గ సమావేశం

Nizamabad | టీఎన్జీవోస్​ కార్యవర్గ సమావేశం

నగరంలో టీఎన్జీవోస్​ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన బుధవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించారు.

అధ్యక్షుడు సుమన్​ మాట్లాడుతూ.. కాల పరిమితి ముగిసిన అన్ని శాఖల ఫోరంలకు ఎన్నికలు సత్వరమే నిర్వహించుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 22న టీఎన్జీవోస్​ సభ్యత్వ నమోదు (Membership) కార్యక్రమం జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు పోల శ్రీనివాస్, పెద్దోళ్ళ నాగరాజు, దినేష్ బాబు, జాకీర్ హుస్సేన్, జ్ఞానేశ్వర్ రెడ్డి, సృజన్ కుమార్, మారుతి, శ్రీనివాస్, విశాల్, సూర్యప్రకాష్, సతీష్ కుమార్, మాణిక్యం, శివకుమార్, అతిక్, సునీత, మంజుల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Must Read