అక్షరటుడే, ఇందూరు: TNGO’s Nizamabad | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగినులతో పాటు అధికారులు బోనమెత్తి అమ్మవారిని కొలిచారు.
కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి (Market Committee Chairman Muppaganga Reddy), టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ (TNGOs State President Jagadishwar), రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్ (TNGOs Dist President Nashetti Suman), శేఖర్, అసోసియోట్ ప్రసిడెంట్ పెద్దోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
TNGO’s Nizamabad | ఆకట్టుకున్న బోనం..
టీఎన్జీవోస్ బోనాల ఉత్సవాల్లో ఆయా శాఖల మహిళా ఉద్యోగులు బోనాలతో హాజరయ్యారు. అయితే నానియాదవ్ మాతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారి బోనంతో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా బోనాల సంబరంలో పాల్గొన్నారు.

