అక్షరటుడే, ఇందూరు: TNGO Membership | అన్ని శాఖల ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని (TNGO membership) స్వీకరించాలని జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ కోరారు. జిల్లా కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో (Education Department office) బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. అనంతరం విద్యాశాఖలోని ఉద్యోగులతో సభ్యత్వ నమోదు చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టీఎన్జీవోస్ నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అశ్విన్, అన్వేష్, సలహాదారు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
