అక్షరటుడే, కామారెడ్డి: Telangana Journalist Forum | తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (TJF) రజతోత్సవ సంబరాల పోస్టర్లను కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్ (R&B Guesthouse) ఆవరణలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 31న జలవిహార్‌లో నిర్వహిస్తున్న వేడుకలకు కామారెడ్డి జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణలో టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు ఒడ్డెమ్ భాస్కర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అంజి, దశాగౌడ్, అంజల్ రెడ్డి, రాములు, రామచంద్రం, నాగరాజు, కిషన్, విశాల్, భరత్ గౌడ్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
