Homeబిజినెస్​Titan Raga Glimmers collection | మార్కెట్​లోకి టైటాన్ రాగా 'గ్లిమ్మర్స్' కలెక్షన్.. మహిళల...

Titan Raga Glimmers collection | మార్కెట్​లోకి టైటాన్ రాగా ‘గ్లిమ్మర్స్’ కలెక్షన్.. మహిళల మణికట్టుపై ఇక మెరుపులే..!

Titan Raga Glimmers collection | టైటాన్ రాగా శక్తివంతమైన, మాయాజాలం వంటి క్షణాలను 'రాగా గ్లిమ్మర్స్' అనే కొత్త కలెక్షన్‌తో అపురూపమైన సిగ్నేచర్ స్టైల్స్‌గా మార్చేందుకు ముందుకొచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Titan Raga Glimmers collection: కొన్నిసార్లు మన జీవితంలో మెరుపులాంటి క్షణాలు వెలిగిపోతుంటాయి. అది పంచుకునే నవ్వులో కనిపించే ఆశ కావచ్చు.. ఊహించని దయలో ఉండే శక్తి కావచ్చు.. ఆత్మ పరిశీలనలో దొరికే నిశ్శబ్ద బలం కావొచ్చు.. ఈ మెరిసే క్షణాలే మనలో ఆశను నింపి, మన జీవితంలో మధుర జ్ఞాపకాలను సృష్టిస్తాయి.

ఈ పండుగ సీజన్‌లో.. టైటాన్ రాగా (Titan Raga) శక్తివంతమైన, మాయాజాలం వంటి క్షణాలను ‘రాగా గ్లిమ్మర్స్’ (Raga Glimmers) అనే కొత్త కలెక్షన్‌తో అపురూపమైన సిగ్నేచర్ స్టైల్స్‌గా మార్చేందుకు ముందుకొచ్చింది.

రాగా బ్రాండ్ అంబాసిడర్ అయిన అలియా భట్Alia Bhatt ఈ ప్రచారానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆత్మవిశ్వాసం, ఆకర్షణ, ఉల్లాసభరితమైన వేడుక స్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. అద్భుతమైన వాచీలను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

Titan Raga Glimmers collection : మెరిసేదంతా మనమే

తమ వ్యక్తిత్వాన్ని నిస్సందేహంగా ప్రకాశింపజేసే మహిళలను ఈ కొత్త కలెక్షన్ అభినందిస్తుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఆమె ఎక్కడ అడుగు పెట్టినా, ఆ ప్రదేశాన్ని తనదైన శైలిలో మార్చేసే వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రచార ట్యాగ్‌లైన్ “ఆల్ దట్ గ్లిమ్మర్స్, ఈజ్ అజ్ (మెరిసేదంతా మనమే)” పొందుపర్చారు.

ఈ నినాదం స్త్రీలు తమ జీవితంలోని ప్రతి రంగంలో చూపించే బలం, ప్రత్యేకత, ప్రకాశాన్ని తెలియజేస్తుందంటున్నారు. రాగా గ్లిమ్మర్స్ (Raga Glimmers) ఈ స్ఫూర్తికి తగ్గట్టుగానే.. డిజైన్ చేయబడింది.

షోస్టాపర్‌గా నిలిచే ‘రేడియంట్ హార్ట్’ (Radiant Heart) వాచ్, గులాబీ, మావ్, తెలుపు రంగుల్లోని 216 రాళ్లతో మెరిసే కదిలే బెజెల్‌తో (movable bezel) ఆకట్టుకుంటుంది.

దీనికి రోజ్ గోల్డ్ బార్క్-ఫినిష్ స్ట్రాప్ జత చేయబడింది. ఇది ప్రత్యేకంగా, ధైర్యంగా (Bold) ఉండే మహిళల కోసం రూపొందించబడింది. మహిళలు ధరించే అన్ని రకాల దుస్తుల్లో ఒక మరచిపోలేని క్షణంగా, ఆకర్షణగా మార్చడానికి దీనిని జ్యువెల్-టోన్డ్ చీరలతో జత చేసేలా తీర్చిదిద్దారు.

‘సెలెస్ట్ బో’ (Celeste Bow) వాచ్ క్లాసిక్ బో (bow) ఆకారాన్ని 274 మెరిసే రాళ్లతో అలంకరించారు. ఆధునికంగా, పండుగలకు అనుగుణంగా ఉండే ఈ వాచ్ వేడుక శైలికి చిహ్నంగా పేర్కొంటున్నారు.

సొగసైన ఫ్యూజన్ వేర్ (fusion wear), రాజసంతో కూడిన గౌన్‌లతో దీనిని జత చేస్తే అత్యుత్తమంగా ఉంటుందంటున్నారు. ఈ ప్రత్యేకమైన టైమ్‌పీస్ మణికట్టుకు శుద్ధి చేసిన గ్లామర్‌ను అందిస్తుంటున్నారు.

‘సీక్రెట్ అవర్’ (Secret Hour) వాచ్, స్లైడింగ్ (జారే) స్క్వేర్ కేస్‌తో (square case) బహుముఖ ప్రజ్ఞకు (versatility) కొత్త అర్థం చెబుతుందంటున్నారు. ఈ కేస్‌ను జరిపినప్పుడు, లోపల తెలుపు మదర్-ఆఫ్-పియ‌ర్ల్, ఫారెస్ట్ గ్రీన్ సన్‌రే డయల్స్ అనే రెండు డయల్స్ కనిపిస్తాయి.

ఒక్కో డయల్ ఆశయం, సాహసం, స్వీయ-వ్యక్తీకరణ ఒక్కో కథను చెబుతాయి. అందుకే ఇది, భిన్నమైన ప్రపంచాలలో జీవించే మహిళలకు సరైన తోడుగా ఉంటుందంటున్నారు.

పగటిపూట దీన్ని ఫార్మల్ దుస్తులతో, రాత్రిపూట విలాసవంతమైన (luxe) దుస్తులతో జత చేస్తే మరింత అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ సేకరణ ప్రత్యేకత దాని శిల్పకళా రూపకల్పన (sculptural design language). ఇందులో ప్రతి వాచ్.. కదిలే ఆభరణంలా అనిపిస్తుందని పేర్కొంటున్నారు. హై-ఫ్యాషన్ సిల్హౌట్‌లు (High-fashion silhouettes), ఆర్కిటెక్చర్ (నిర్మాణ) కళాత్మకత నుంచి ప్రేరణ పొంది వీటిని రూపొందించారట.

టైటాన్ కంపెనీ లిమిటెడ్‌… టైటాన్ వాచెస్ & రాగా మార్కెటింగ్ హెడ్ అపర్ణా రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “రాగా గ్లిమ్మర్స్‌ను రూపొందించడంలో మా లక్ష్యం కేవలం డిజైన్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. ఏ మాత్రం సంకోచం లేకుండా ప్రకాశించే మహిళల తేజస్సు, ఆశ, ఆనందాన్ని ప్రతిబింబించే ఒక భావోద్వేగాన్ని బంధించాలని మేము ఆశించాం. మహిళ.. తాను చేసే ప్రతి సంరక్షణ చర్యలోకి, తాను పెంచే ప్రతి అనుబంధంలోకి, తాను సాహసించే ప్రతి కలలోకి తన సొంత కాంతిని తీసుకువెళుతుంది. సరిగ్గా ఈ బలమైన నమ్మకం నుంచే ‘గ్లిమ్మర్స్’ సేకరణ ఉద్భవించింది..” అని తెలిపారు.

“ఆలియా భట్ ఈ ప్రచారానికి సారథ్యం వహించడం ద్వారా, ఆ స్ఫూర్తి తిరస్కరించలేని ఉనికి, నిర్భయమైన ఆత్మవిశ్వాసంతో జీవం పోసుకుంది. ఈ పండుగ సీజన్‌లో, ఈ కలెక్షన్ కేవలం ఫ్యాషన్‌ను మాత్రమే మెరుగుపరచకుండా.. రాగా బ్రాండ్‌కు, దానిని నిర్వచించే మహిళలకు మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నా..” అని అన్నారు.

ఈ కలెక్షన్ రూ.8,395 నుంచి రూ. 28,795 వరకు లభిస్తుంది. ఇందులో ఆవిష్కరణ, పండుగ కళాత్మకతను వేడుక చేసుకునే 16 విలక్షణమైన SKUలు (విభిన్న రకాలు) ఉన్నాయి. రాగా గ్లిమ్మర్స్ ఇప్పుడు అన్ని టైటాన్ అవుట్‌లెట్‌లలో, ఆన్‌లైన్‌లో titan.co.in ద్వారా అందుబాటులో ఉంటాయి.