అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. నాందేడ్ Nanded నుంచి తిరుపతి వరకు వారాంతపు ప్రత్యేక రైలు నడపబోతోంది. ఇది వయా నిజామాబాద్ Nizamabad, పెద్దపల్లి Peddapalli మార్గంలో ప్రయాణించనుంది.
Special Train : ఎప్పటి నుంచి అంటే..
నాందేడ్ తిరుపతి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల(ఆగస్టు 2 నుంచి ఆగస్టు 30 వరకు)లో అందుబాటులో ఉంటుంది. వారానికి ఒకసారి చొప్పున నెల రోజుల్లో ఐదుసార్లు అందుబాటులో ఉండనుంది.
Special Train : ప్రయాణ వేళలు ఇలా…
ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం సాయంత్రం 4:50 నిమిషాలకు బయలుదేరి నాందేడ్ నుంచి బయలుదేరుతుంది. బాసర Basara రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6:23, నిజామాబాద్ జంక్షన్‌కు రాత్రి 7:23 గంటలకు చేరుకుంటుంది.
నిజామాబాద్ నుంచి బయలు దేరాక.. లింగంపేట జగిత్యాల Lingampet Jagtiala రైల్వే స్టేషన్‌కు రాత్రి 8:38, కరీంనగర్ రైల్వే స్టేషన్‌కు రాత్రి 9:38, పెద్దపల్లి జంక్షన్‌కు 10:00 గంటలకు చేరుకుంటుంది.
ఇక పెద్దపల్లి నుంచి 10:05 నిమిషాలకు బయలుదేరి, వరంగల్ Warangal కు రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.
Special Train : తిరుగు ప్రయాణంలో..
07016 తిరుపతి నుంచి నాందేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఆగష్టు -3 నుంచి ఆగష్టు – 31 వరకు 5 ట్రిప్ లు అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రతి ఆదివారం సాయంత్రం 7:45 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరుతాయి. వరంగల్‌కు మరుసటి రోజు ఉదయం 6:33 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 8:15 గంటలకు, కరీంనగర్ 9:08 గంటలకు, లింగంపేట జగిత్యాల 9:58 గంటలకు, నిజామాబాదు జంక్షన్ 11:28 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి బాసరకు మధ్యాహ్నం 12:03, నాందేడ్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది.