అక్షరటుడే, ఇందూరు: Neela kantheshwara Temple | జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన నీలకంఠేశ్వర ఆలయం నూతన పాలకవర్గాన్ని నియమించారు.
ఈ మేరకు శనివారం దేవాదాయ శాఖ (Endowment Department) ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఛైర్మన్గా సిరిగిరి తిరుపతి (Sirigiri Tirupathi) నియమించారు. అలాగే ఆలయ డైరెక్టర్లుగా నందకిషోర్, మదన్మోహన్, వెంకట్ రెడ్డి, కాటిపల్లి రాజు, నాగనాథరావు, శ్రీనివాస్ గౌడ్, శంకర్, విజయ రాణి, సత్యనారాయణ, క్రాంతి కిరణ్, చంద్రకాంత్, నాగారావు, నర్సింగరావును నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా.. ఇప్పటికే నగరంలోని జెండా గుడి(Jenda gudi), గోల్ హనుమాన్ ఆలయం (Goal Hanuman Temple), శంభుని గుడి (Shambuni Gudi) తదితర ఆలయాల పాలకవర్గాలను నియమించిన విషయం తెలిసిందే.