Homeఆంధప్రదేశ్Tirumala | తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి విరాళాలు.. గత 11 నెలల్లో ఎన్ని కోట్ల...

Tirumala | తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి విరాళాలు.. గత 11 నెలల్లో ఎన్ని కోట్ల విరాళాలు వ‌చ్చాయంటే..!

తిరుమల శ్రీవారికి భక్తులు రికార్డు స్థాయిలో విరాళాలు అందించారు. గత 11 నెలల్లో ₹918.6 కోట్లు విరాళాలు వ‌చ్చాయి. ఇందులో అత్యధిక విరాళాలు అన్నప్రసాదం మరియు శ్రీవాణి ట్రస్ట్‌లకు అందాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారికి గత 11 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.918.6 కోట్లు విరాళాలు అందినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ప్రకటించింది. 2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16 వరకు వచ్చిన విరాళాలలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.252.83 కోట్లు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.97.97 కోట్లు అందాయి.

Tirumala | ఇతర ట్రస్ట్‌లకు వచ్చిన విరాళాలు..

  • ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ : రూ.66.53 కోట్లు
  • ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ : రూ.56.77 కోట్లు
  • స్వీ విద్యాదాన ట్రస్ట్ : రూ.33.47 కోట్లు
  • బర్డ్ ట్రస్ట్ : రూ.30.02 కోట్లు
  • ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ : రూ.20.46 కోట్లు
  • ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ : రూ.13.87 కోట్లు
  • ఎస్వీబీసీ : రూ.6.29 కోట్లు
  • స్విమ్స్ : రూ.1.52 కోట్లు

విరాళాల్లో ఆన్‌లైన్ ద్వారా రూ.579.38 కోట్లు, ఆఫ్‌లైన్ ద్వారా రూ.339.20 కోట్లు అందాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దాతలకు తగిన గౌరవం, సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా లోపం తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. విరాళాలతో పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి కూడా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, అమరావతిలోని వెంకటపాలెం సమీపంలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని (Sri Venkateswara Swamy Temple) టీటీడీ ఛైర్మన్ స్వయంగా సందర్శించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలిస్తూ, ఆలయ అలంకరణ, క్యూలైన్ ఏర్పాట్లలో స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని ఆలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఛైర్మన్ నిర్ణయించారు. TTD ప్రకటన ప్రకారం, ఛైర్మన్ ఆలయానికి చేరుకున్న వెంటనే టెంపుల్ అర్చకులు, ఇన్​స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.