Kamareddy DPRO | కామారెడ్డి డీపీఆర్వో నియమితులైన బి తిరుమల గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan)ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందజేయడంలో, వివిధ ప్రచార మాధ్యమాలతో సమన్వయం చేస్తూ విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా డీపీఆర్వోగా విధులు నిర్వహించిన ఆమె కామారెడ్డికి బదిలీపై వచ్చారు.