Homeభక్తిTTD | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. విడుదల కానున్న అక్టోబరు కోటా దర్శనం టికెట్లు.....

TTD | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. విడుదల కానున్న అక్టోబరు కోటా దర్శనం టికెట్లు.. ఎప్పుడంటే..

- Advertisement -

అక్షరటుడే, తిరుమల: TTD : అక్టోబ‌రుకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా Srivari Darshan ticket quota విడుదలపై టీటీడీ TTD కీలక ప్రకటన చేసింది. వేంకటేశ్వర స్వామి దర్శనం Venkateswara Swamy Darshan, గదుల కోటా వివరాలను ప్రకటించింది.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు చెందిన అక్టోబ‌రు కోటాను ఈ నెల (జులై) 19న మార్నింగ్​ 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ విషయానికి వస్తే.. ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసుకోవచ్చు.

ఇక, ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారు ఈ నెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు జారీ చేస్తారు.

TTD : 22న కల్యాణోత్సవ టికెట్ల విడుదల

ఈ నెల 22న మార్నింగ్​ 10కు ఊంజల్ సేవ Oonjal Seva, కల్యాణోత్సవం Kalyanotsavam, ఆర్జిత బ్రహ్మోత్సవం Arjitha Brahmotsavam, వార్షిక పుష్పయాగం Pushpayagam, సహస్రదీపాలంకార సేవ Sahasradeepalankara Seva టికెట్లను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల కానుంది.

TTD : 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు..

ఈ నెల 23న అంగప్రదక్షిణం Angapradakshinam టోకెన్ల కోటా విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదలపైనా టీటీడీ ప్రకటన ఇచ్చింది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటా జారీ కానుంది.

ఇక ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు దివ్యాంగులు, వ‌యోవృద్ధులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది.

TTD : 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా..

ఈ నెల 24న ఆన్​లైన్​లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా Special entry darshan ticket quota జారీ కానుంది. ఇక గదుల విషయానికి వస్తే.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లోని గదుల కోటాను జారీ చేయనుంది.

ఆయా సేవలకు సంబంధించిన టోకెన్ల కోసం భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్​ను సంప్రదించవచ్చని టీటీడీ సూచించింది.