అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala Snake Bite | తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తురాలిని పాము కాటేయడం (Snake Bite) తీవ్ర ఆందోళనకు దారితీసింది.
సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న (Tirumala Tirupati Devasthanam) (టీటీడీ) సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాధితురాలిని అక్కడి నుంచి తరలించారు. మొదట తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యసహాయం కోసం తిరుపతిలోని Sri Venkateswara Institute of Medical Sciences (స్విమ్స్) ఆసుపత్రికి తరలించారు.
Tirumala Snake Bite | నిలకడగా ఆరోగ్యం
పాము కాటుకు గురైన భక్తురాలు మౌనికగా గుర్తించారు. ఆమె తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా (Bhupalapally District)కు చెందినవారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. మౌనిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. భక్తులు వేచి ఉండే క్యూలైన్లను సిబ్బంది క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు భక్తులకు హామీ ఇచ్చారు.
భక్తులు భారీగా తరలివస్తున్న తిరుమలలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు.
