Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంపై ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదన్నారు. ఇందులో కుట్ర కోణం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కల్తీ నెయ్యి (Adulterated Ghee) వ్యవహారంలో సిండికేట్గా తయారయ్యారని చెప్పారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందన్నారు. ఎన్‌డీడీబీ రిపోర్టు (NDDB Report) రాగానే తాను ప్రకటన చేశానని గుర్తు చేశారు. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయన్నారు. తాను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేశానని పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) తమ కులదైవం అని, ఆయనే తనను కాపాడరని చెప్పారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే అప్పుడు తనపై దాడి చేశారని, ఇప్పుడు మావోయిస్టు టాప్ లీడర్లు లొంగిపోతున్నారని చెప్పారు.

Tirumala Laddu Adulteration Issue | నిబంధనలు మార్చారు

టీటీడీ నెయ్యి సరఫరా కోసం 2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారని చంద్రబాబు అన్నారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టగా 2022 ఆగస్టులో నివేదిక వచ్చింని, 2024 జులైలో ఎన్‌డీడీబీ నివేదిక వచ్చిందని తెలిపారు. పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు.

Tirumala Laddu Adulteration Issue | టీటీడీ బోర్డుదే తప్పు..

గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. టీటీడీ బోర్డుదే తప్పని చెప్పారు. టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పారని, రసాయనాల్లో అసలు ఏముందో దేవుడికే తెలియాలన్నారు. ఇది హిందూ మతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారని ఆయన అన్నారు.

Related articles

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది

Lakshman Rathod Award | లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డు

విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది.