Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్​ అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

తమిళనాడు (Tamilnadu)కు చెందిన ఇద్దరు ​ రైడర్లు బైక్​పై తిరుమల వచ్చారు. ఈ క్రమంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బారికేడ్ని ఢీకొట్టి రోడ్డు అవతల వారు పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో భక్తుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. 30వ మలుపు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడిని తమిళనాడుకు చెందిన నటరాజన్‌గా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని తిరుపతి స్విమ్స్ (Tirupati Swims)​కు తరలించారు.

Tirumala Ghat Road Accident | ట్రాక్టర్​ను ఢీకొన్న బైక్

ట్రాక్టర్​ను బైక్​ ఢీకొన్న ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. ట్రాక్టర్​ డ్రైవర్​ సడెన్​గా మలుపు తీసుకోవడం, బైక్​ వేగంగా ఉండటంతో ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా (Suryapet District) చింతలపాలెం మండలం దొండపాడు శివారులో ఈ ఘటన చోటు చేసుకోగా.. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు దొండపాడు గ్రామానికి చెందిన కిరణ్, సాయిగా గుర్తించారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.