Homeతాజావార్తలుTirumala | తిరుమల భక్తులకు అలర్ట్ .. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

Tirumala | తిరుమల భక్తులకు అలర్ట్ .. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

Tirumala | వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి స్పష్టత ఇచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, తిరుమల: Tirumala తిరుమల శ్రీవారి భక్తులు ఆతృతగా ఎదురుచూస్తున్న వైకుంఠ ద్వార దర్శనాల షెడ్యూల్‌పై టీటీడీ TTD స్పష్టత ఇచ్చింది.

ఈ సంవత్సరం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ TTD EO Anil Kumar Singhal ప్రకటించారు.

ఈ కాలంలో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈవో మాట్లాడుతూ, దర్శనానికి సంబంధించిన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

Tirumala | టీటీడీ సూచ‌న‌..

అలాగే భక్తుల Devotees విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వచ్చే ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తొమ్మిది రకాల సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఈవో చెప్పారు.

ఈ సెంటర్ ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, కంపార్టుమెంట్ల పర్యవేక్షణ, ప్రతిభక్తుడి డేటా సేకరణ వంటి సేవలు అందుతాయి. అదనంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

భక్తుల సూచనల మేరకు శ్రీవాణి మరియు ఇతర దర్శన టోకెన్ల Tokens విధానంపై పరిశీలించేందుకు టీటీడీ బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మించనున్నట్లు ఈవో వెల్లడించారు.

తిరుమల అటవీ ప్రాంతంలో రాబోయే పది సంవత్సరాల్లో జీవ వైవిధ్య సంరక్షణ, పచ్చదనం పెంపుపై టీటీడీ దృష్టి సారించిందని తెలిపారు.

అంతేకాక, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్నప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి అమరావతి పరిధిలోని వెంకటపాలెం శ్రీవేంకటేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు కూడా వెల్లడించారు.

Must Read
Related News