ePaper
More
    Homeభక్తిTiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న అరుదైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం lunar eclipse ఏర్పడబోతోంది.

    దృక్‌ పంచాంగం Drik Panchangam ప్రకారం ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. గ్రహణ వ్యవధి 3.28 నిమిషాలు.

    సెప్టెంబరు 7 న రాత్రి 11:42 గంటల సమయానికి చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం(Lunar eclipse).

    గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు. దీంతో వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం మన దేశంలో కనిపించనుంది.

    Tiruma Temple close | చంద్ర గ్రహణం అంటే..

    భూమి, సూర్యుడు, చంద్రుడు(Moon) ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ ఘటన. గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు కనిపించడు.

    లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ ఘటనకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాలు, ప్రశాంతతను సూచిస్తాడు.

    ఈసారి చంద్రగ్రహణం ఆసియా ఖండంలోని భారత్‌(Bharath)తో సహా రష్యా, సింగపూర్‌, చైనా వంటి దేశాల్లో కనబడనుంది.

    చంద్రగ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి Srivari ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటించింది. 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసి ఉండనుంది.

    రేపు (ఆదివారం) సా 3:30 గంటల నుంచి ఎల్లుండి (సోమవారం) ఉ 3 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు.

    శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులతో కంపార్టమెంట్లు, షెడ్లు, క్యూలైన్లు నిండిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భక్తులను సర్వదర్శనానికి అనుమతించడాన్ని టీటీడీ నిలిపివేసింది.

    భక్తులు పీఏసీ 1, 2, 3 హాల్స్ లో వేచి ఉండాలని, ఎల్లుండి (సోమవారం) ఉ 6 గంటలకు క్యూలైన్​లోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ సూచించింది.

    గ్రహణం విడిచాక శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. తదుపరి నిత్యసేవలను ఏకాంతంగా నిర్వహించినాంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

    చంద్రగ్రహణం కారణంగా రేపు (ఆదివారం) ఆర్జిత సేవలు, ఎల్లుండి (సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ సూచించింది.

    More like this

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Silver Ring | బొటనవేలికి వెండి ఉంగరం ధరించారా.. లక్ష్మీదేవి వచ్చినట్టే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Silver Ring | ప్రతి ఒక్కరి జీవితంలో ఉంగరాలు ధరించడం ఒక సాధారణ ఆచారం. మనం...