అక్షరటుడే, బాన్సువాడ: Tiranga rally | భారత్, పాకిస్తాన్ (india – pakistan) మధ్య జరిగిన దాడుల్లో భారత సైన్యం విజయం సాధించిన నేపథ్యంలో సంఘీభావంగా బాన్సువాడలో తిరంగా ర్యాలీ (Tiranga rally) నిర్వహించారు. బుధవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలు భారీగా హాజరయ్యారు. త్రివర్ణ పతాకాలు (tricolor flags) పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. దేశం జోలికి వస్తే ఉరుకునే ప్రసక్తే లేదని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana) , మాజీ ఎంపీ బీబీ పాటిల్ (former MP Bibi Patil), శ్రీనివాస్ గార్గే, లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, బధ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
