ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Tiranga Rally | ఐక్యతను చాటేందుకే తిరంగా ర్యాలీ: ఎమ్మెల్యే ధన్​పాల్​

    Tiranga Rally | ఐక్యతను చాటేందుకే తిరంగా ర్యాలీ: ఎమ్మెల్యే ధన్​పాల్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Tiranga Rally |  జాతీయ సమైక్యతను చాటేందుకే తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ( Mla Dhanpal) పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని గాంధీచౌక్ (Gandhi Chowk) నుంచి బస్టాండ్ మీదుగా తిలక్ గార్డెన్ (Tilak Garden) చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) నినాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

    రాజకీయాలకతీతంగా ర్యాలీలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor​) విజయవంతం చేయడంలో సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాకు ఇచ్చే గౌరవమే తిరంగా ర్యాలీ అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15కు ముందు ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

    అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh kulachary) మాట్లాడుతూ.. ర్యాలీలో విద్యార్థులు ప్రదర్శించిన భారీ త్రివర్ణ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, వ్యాపారస్థులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    నగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

    More like this

    September 8 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 8 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 8,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...