170
అక్షరటుడే, గాంధారి: Illegal Mining | అనుమతుల్లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు గాంధారి ఎస్సై ఆంజనేయులు (Gandhari Sub-Inspector Anjaneyulu) శుక్రవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.
Illegal Mining | పక్కా సమాచారంతో..
మొరం అక్రమంగా తరలిస్తున్నారనే (illegally transporte) పక్కా సమాచారంతో మండలంలోని సర్వపూర్ శివారులో పోలీసులు (police) నిఘా పెట్టారు. సీతాయిపల్లి, వెంకటాపూర్ తండా శివారులో వేర్వేరు గ్రామాలకు మొరాన్ని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకున్నారు. ఈ టిప్పర్లు సీతాయిపల్లికి చెందిన గంగాధర్ అనే వ్యక్తికి సంబంధించినవిగా గుర్తించి సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఇసుక, మొరం అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.