అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు సీజ్ చేశారు. భీమ్గల్ ఎస్సై సందీప్ (Bheemgal SI Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్గల్ మండలంలోని (Bheemgal Mandal) దేవునిపల్లి నుంచి శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.
అనంతరం ఇసుకతో ఉన్న టిప్పర్ను జప్తు చేసి ఠాణాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. ఇసుకను ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.