Homeజిల్లాలునిజామాబాద్​National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీబీపూర్​ తండా (Bibipur Thanda) వద్ద డిచ్​పల్లి (Dichpally) వైపు వెళ్తున్న టిప్పర్ (Tipper) అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపక్కకు దూసుకుపోయింది.

అతివేగంగా సైడ్​వాల్​ను ఢీకొట్టడంతో అది ఓవైపు వంగిపోయాయి. దీంతో టిప్పర్​లో​ ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానికులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

National Highway | డ్రైవర్ల అతివేగమే కారణం..

జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి డ్రైవర్ల అతివేగమే కారణమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.

Must Read
Related News