అక్షరటుడే, కామారెడ్డి: Bhiknoor | భిక్కనూరు మండలం జంగంపల్లి (Jangampally) వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు (Ramayampet) స్కూటీపై వెళ్తున్న నలుగురిని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది.
ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో బైక్‌లో ఇద్దరు బాలురు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని బయటకు తీశారు. ఇద్దరిలో ఒకరు మృతి చెందగా.. మరో బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరు ఖమ్మంలో నివాసముంటుండగా.. జంగంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.