అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్‌కు గాయాలైన ఘటన పెద్దకొడప్గల్ మండలంలో చోటుచేసుకుంది. రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ తహశీల్దార్ మహేందర్‌కుమార్ కామారెడ్డి నుంచి జుక్కల్ రెవెన్యూ సదస్సుకు బుధవారం కారులో వెళ్తున్నారు. పెద్దకొడప్గల్ మండలం అంజనీ గేట్ వద్ద ఆయన కారును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో తహశీల్దార్‌కు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను పెద్దగొడప్గల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nizamsagar | కారును ఢీకొన్న టిప్పర్: తహశీల్దార్‌కు గాయాలు
50
previous post