అక్షరటుడే, వెబ్‌డెస్క్:Nandyala | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. టిప్పర్ అదుపు తప్పి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే(Nandikotkur Highway)పై చోటు చేసుకుంది. టిప్పర్(Tipper) అదుపు తప్పి డివైడర్‌పై నుంచి వెళ్లి మరి అవతల రోడ్డులో వెళ్తున్న బైక్ను ఢీకొంది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో వాహనదారులు ఎల్లాగౌడ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
