అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sangareddy | సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాజిపల్లి గ్రామంలో కంకరను అన్‌లోడ్ చేస్తుండగా.. టిప్పర్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ కారణంగా టిప్పర్‌కు మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. కాగా.. డ్రైవర్ మధ్యప్రదేశ్(Madya Pradesh)కు చెందిన రాం సుజన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
