అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షలకు (degree exams) సంబంధించిన టైంటేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. డిగ్రీ-సీబీసీఎస్-ఒకటవ, మూడవ, ఐదో, సెమిస్టర్ రెగ్యులర్, రెండవ, నాల్గవ, ఆరవ, సెమిస్టర్ (బ్యాక్‌లాగ్స్) పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Telangana University | థియరీ పరీక్షలు..
2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు (students) థియరీ పరీక్షలు నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
