Bar Association Nizamabad | సమయానుకూలంగా సమస్యల పరిష్కారం.. జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి

అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ చక్రాల్లాంటివని నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి nizamabad district judge bharatha lskhmi పేర్కొన్నారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందన్నారు. న్యాయవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి ముందుకు నడిపించాల్సింది న్యాయవాదులేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లాకోర్టు nizamabad district court ప్రాంగణంలోని పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్ […]

అక్షరటుడే, ఇందూరు: bar and bench : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ చక్రాల్లాంటివని నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి nizamabad district judge bharatha lskhmi పేర్కొన్నారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందన్నారు. న్యాయవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి ముందుకు నడిపించాల్సింది న్యాయవాదులేనని న్యాయమూర్తి పేర్కొన్నారు.

జిల్లాకోర్టు nizamabad district court ప్రాంగణంలోని పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్ లో నిర్వహించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ nizamabad bar association నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లా కోర్టు అవసరాలకు అనుగుణంగా, వాహనాల రద్దీ, కక్షిదారుల రాకపోకల దృష్ట్యా మరింత ఖాళీ స్థలం కావలసిన అవసరం ఉన్నదని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మాట్లాడినట్లు తెలిపారు.

bar and bench : కోర్టు కోసం విద్యాశాఖ స్థలం..

బార్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి మాట్లాడుతూ.. కోర్టుల సంఖ్య పెరిగిందని. దాంతో పాటు మోటారు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా జిల్లాకోర్టుకు ఆనుకుని ఉన్న విద్యాశాఖ స్థలాన్ని పరిశీలించాలని విన్నవించారు. నూతన బార్ కార్యవర్గానికి ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తానని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి advocate rajendhar reddy తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు advocate Manik raj మాట్లాడుతూ.. బార్ అండ్ బెంచ్ కలిసికట్టుగా న్యాయసేవలు అందిద్దామని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాస్, ఆశాలత, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...